♪
నా సంగీతం
Kalalu Kane Naa Nayanam
Lyrics, Singer, Music: Naveen Chatlapalli
రచన, గానం, సంగీతం: Naveen Chatlapalli25 ఏప్రిల్, 2026ప్రేమభావగీతంలిరిక్
Spotify
YouTube Music
పాట సాహిత్యం
పల్లవి
రెప్ప దాటిన... చూపు ఆగదు... నిన్ను చూడక
గుండె చాటున... మాట ఆగదు... నీకు చెప్పక
నిన్నటి దాకా లోకం వేరు
నేటికీ మారింది నా తీరు
అద్దం ముందు నిలుచుంటే... నీ రూపే చూపిస్తోంది
పసివాడిలా నా మనసే... నీ వెంటే పరిగెడుతోంది
చరణం 1
కలలు కనే నా నయనం...
నీ రూపమే చూస్తోంది!
కథలు రాసే నా హృదయం...
నీ కోసమే వేచిఉంది!
చెంత నువ్వు ఉంటే... లోకమే చిన్నదయింది
జంట నువ్వు ఉంటే... కష్టమే తీపిగా మారింది
చరణం 2
మాట రాక నా మౌనం...
నీ పేరునే జపిస్తోంది!
బాట తెలియని నా పయనం...
నీ వైపే సాగుతోంది!
ప్రేమంటే ఏమిటో... ఇప్పుడే అర్థమయింది
నీ నీడై బ్రతకడమే... జన్మకు అర్థమనిపించింది
నా ఇతర పాటలు
