Chinni Saigatho
Lyrics, Singer, Music: Naveen Chatlapalli
Spotify మరియు YouTube Music విడుదల త్వరలో.
చిన్ని సైగతో మనసునే దోచావే..
మాటతో నన్ను మాయ చేసావే..
ఒక్క చూపుతో నా గుండెలోన చేరావే..
ఎంత ప్రేమో చూపనా.. నీలో కలిసేలా పిలిచిందే ఈ వసంతమే ...
oh oh oh oh oh... నీతోనే చేసే ప్రయాణం ..చేరాలి తీరం..
oh oh oh oh oh... నువ్వేలే నాలోని సర్వం.. నాకింక లోకం..
నీ వెంటే నడిచానే.. నా దారే మరిచానే..
నీ మాటే విన్నానే.. నా లోకం మారిందే..
ఏ మాయో చేశావే.. నా ఊపిరినే తాకావే..
నీ ప్రేమే చాలంటూ.. నా మనసే పలికిందే..
(oh oh oh oh oh... నీతోనే చేసే ప్రయాణం...)
నీ నీడను చూసానే.. నా తోడుగ మార్చానే..
నీ గొంతును విన్నానే.. నా పాటగ మలిచానే..
ఈ గాలిని అడిగానే.. నీ కబురులు తెచ్చిందే..
ఆ జాబిలి తలవంచి.. మన జంటకు మురిసిందే..
(oh oh oh oh oh... నువ్వేలే నాలోని సర్వం...)
చిన్ని సైగతో మనసునే దోచావే..
మాటతో నన్ను మాయ చేసావే..
ఒక్క చూపుతో నా గుండెలోన చేరావే..
ఎంత ప్రేమో చూపనా.. నీలో కలిసేలా పిలిచిందే ఈ వసంతమే ...
oh oh oh oh oh... నీతోనే చేసే ప్రయాణం..చేరాలి తీరం ..
oh oh oh oh oh... నువ్వేలే నాలోని సర్వం.. నాకింక లోకం..
